కడప జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 మందికి నెగిటివ్ రిపోర్టు రావడంతో కరోనా బారినుండి వారు పూర్తిగా కోలుకున్నట్లు వైద్యాధికారులు నిర్ధారించడంతో ఆ ఆరుగురిని శనివారం డిశ్చార్జి చేసినట్లు కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. వీరిలో ముగ్గురు ప్రొద్దుటూరు, ఒకరు పులివెందుల, ఇద్దరు బద్వేలుకు చెందిన వారు ఉన్నారు. వీరందరికీ 24 గంటల వ్యవధిలో రెండు సార్లు పరీక్ష చేస్తే, రెండింటిలోనూ నెగెటీవ్ రిపోర్టు రావడం జరిగిందన్నారు. దీంతోపాటు చెస్ట్, ఎక్స్-రే వంటి అన్ని నిర్ధారణ పరీక్షలు చేసి పూర్తిగా కోలుకున్నట్లు నిర్ధారించాకే.. వారిని డిశ్చార్జి చేయడం జరిగిందన్నారు. డిశ్చార్జి అయిన వారందరికీ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి రూ.2000 ఆర్థిక సాయం, పండ్లు, డ్రైఫ్రూట్స్‌ను పంపిణీ చేయడం జరిగిందన్నారు. 16న 13 మందిని డిచార్జ్ చేశారు. జిల్లాలో మొత్తం 19 మందిని మూడు రోజుల వ్యవధిలో డిశ్చార్జి చేశారు. జిల్లాలో 37 పాజిటివ్ కేసులుండగా.... ఆక్టీవ్ కేసులు 18 ఉన్నాయని కలెక్టర్ హరికిరణ్ ప్రకటనలో తెలిపారు.
'కడప జిల్లాలో ఆరుమంది డిశ్చార్జ్ - కడప జిల్లాలో 6మంది డిచార్జ్
కడప జిల్లాలో కోవిడ్‌తో చికిత్స పొందుతున్న 6 మందికి నెగిటివ్ రిపోర్టు రావటంతో వారిని డిశ్చార్జ్ చేసినట్లు కలెక్టర్ హరికిరణ్ తెలిపారు.
'కడప జిల్లాలో ఆరుమంది డిచార్జ్'