ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా .. కడప జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురు బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. దువ్వూరు, రాజంపేట మండలాలకు చెందిన ఆరుగురు బుకీలను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు అదనపు ఎస్పీ దేవప్రసాద్ తెలిపారు. దువ్వూరు మండలం మాచనపల్లె గ్రామం వద్ద క్రికెట్ బెట్టింగ్ చేస్తున్న రాజా రామ్మోహన్ రెడ్డి తోపాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు.
ఆరుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్ - కడప జిల్లా రాజంపేటలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ వార్తలు
ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో.. క్రికెట్ బెట్టింగ్‌కి పాల్పడిన ఆరుగురుని పోలీసులు అరెస్టు చేసిన ఘటన కడప జిల్లాలోని దువ్వూరు, రాజంపేటలో జరిగింది. నిందితులను రిమాండుకు తరలించినట్లు అదనపు ఎస్పీ దేవప్రసాద్ తెలిపారు. బెట్టింగ్‌రాయుళ్ల నుంచి లక్షా 20 వేల నగదు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆరుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్
రాజంపేట మండలంలో యాప్ ద్వారా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సుబ్బరాయుడు అనే యువకున్ని అదుపులోకి తీసుకున్నారు. సుబ్బరాయుడు ఇప్పటికే 25 లక్షల రూపాయల బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు గుర్తించారు. రెండు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి లక్షా 20 వేల నగదు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు.
ఇవీ చదవండి