కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని అన్నమయ్య నగర్ లో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని ప్రారంభించారు. ఆలయంలో సీత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను శుక్రవారం వేకువజామున ప్రతిష్ఠించారు. అనంతరం సీతారామ కళ్యాణ మహోత్సవం కమనీయంగా నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్వామివారి కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు తరలిరాగా... వేద మంత్రోచ్ఛరణల మధ్య క్రతువును నిర్వహించారు. భక్తులకు తీర్థ, అన్న ప్రసాదాలు అందజేశారు.
కన్నుల పండువగా సీతారాముల కల్యాణం - rajampeta
కడప జిల్లా బోయినపల్లిలో నూతనంగా నిర్మించిన రామాలయంలో సీతారామ, లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్ఠించారు.
విగ్రహప్రతిష్ఠ