వివేకా హత్య కేసులో విచారణ వేగవంతం - వివేకా వాచ్‌మన్‌కు నార్కో పరీక్ష
వైకాపా నాయకుడు వివేకానందరెడ్డి హత్య కేసులో.. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ మరింత ముమ్మరం చేసింది. కిరాయి హంతకుడు శేఖర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివేకా ఇంటి వాచ్‌మన్ రంగన్న రేపు హైదరాబాద్‌లో నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించనున్నారు.
వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు సిట్ అధికారులు. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్నను నిన్న, ఇవాళ పోలీసులు విచారించారు. రంగన్నకు నార్కో అనాలసిస్ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పులివెందుల కోర్టులో పిటిషన్ వేయగా న్యాయస్థానం అనుమతించింది. రంగన్న అనుమతి మేరకే నార్కో అనాలసిస్ పరీక్షలకు కోర్టు సమ్మతించింది. ఈనేపథ్యంలోరేపు హైదరాబాద్‌లో రంగయ్యకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఆయనతోపాటు కిరాయి హంతకుడు శేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.