ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వివేకా హత్య కేసులో మాజీ మంత్రికి సిట్‌ నోటీసులు

By

Published : Dec 9, 2019, 9:07 PM IST

వైఎస్ వివేకా హత్య కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి సిట్‌ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించకపోవటంతో మూడోసారి వీటిని పంపారు.

sit issued notices for aadinarayana reddy in viveka murder case
మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే వై.ఎస్.భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, బీటెక్ రవి సహా పలువురిని అధికారులు ప్రశ్నించారు. తాజాగా వివేకా హత్య కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి సిట్‌ నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరుకావాలని అందులో స్పష్టం చేసింది. వారం రోజుల్లో ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చినా ఆదినారాయణ రెడ్డి విచారణకు హాజరుకాలేదు. దీనివల్ల సిట్‌ అధికారులు మూడోసారి నోటీసులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details