ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నార్కో పరీక్షకు వివేకా హత్యకేసు నిందితులు

వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, శేఖర్ రెడ్డిని నార్కో పరీక్షల నిమిత్తం గుజరాత్​కు తరలించారు. పరమేశ్వర్ రెడ్డిని సైతం గుజరాత్ తరలించనున్నారు. మొత్తం నలుగురు అనుమానితులకు వివేకా హత్యకేసులో నార్కో పరీక్షలు చేయనున్నారు.

వివేకా హత్యకేసు... నార్కో పరీక్షలకు అనుమానితులు

By

Published : Jul 30, 2019, 9:17 PM IST

వివేకా హత్యకేసు... నార్కో పరీక్షలకు అనుమానితులు

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్న పరమేశ్వరరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు చేయాలని పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలైంది. పరమేశ్వరరెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపరిచిన పోలీసులు... నార్కో అనాలసిస్ పరీక్షలు చేసేందుకు కోర్టు అనుమతి కోరారు. పరమేశ్వరరెడ్డి సమ్మతితోనే నార్కో అనాలసిస్ పరీక్షలు చేయాలని కోర్టు అనుమతించింది. నార్కో పరీక్షల కోసం ముగ్గురు అనుమానితులను పోలీసులు గుజరాత్‌కు తరలించారు. రంగన్న, ఎర్ర గంగిరెడ్డి, శేఖర్‌రెడ్డిని మూడ్రోజుల క్రితం గుజరాత్ తీసుకెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details