కమలాపురం మూడు రోడ్ల కూడలిలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో రైతులు తమ పొలాల్లో కూలీలుగా మారే ప్రమాదముందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. అటువంటి చట్టాలు తీసుకొచ్చిన భాజపాకు.. వైకాపా, తెదేపాలు మద్దతివ్వడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ - kamalapuram congress leaders latest news
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు కమలాపురంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి యన్. తులసిరెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతల సంతకాల సేకరణ