కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీలోని ఏడు, ఎనిమిది వార్డుల్లో సచివాలయ ఉద్యోగులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. సచివాలయం అడ్మిన్ ఉద్యోగి జోసెఫ్ మనోహర్ కార్యాలయంలో ఉండగా జమ్మలమడుగు పట్టణ ఎస్సై రవికుమార్ లోనికి వెళ్ళాడు. ఆ ఉద్యోగి ముఖానికి టవలు చుట్టుకొని ఉండగా... దాన్ని తీయాలని ఆదేశించాడు. అందుకు అడ్మిన్ అధికారి కరోనా నేపథ్యంలో ముఖానికి ముసుగు తీయడానికి నిరాకరించాడు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎస్సై... సచివాలయ ఉద్యోగి కాలర్ పట్టుకున్నాడు. ఈ చర్యను నిరసిస్తూ వాలంటీర్లు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు. స్థానికి ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగి కాలర్ పట్టుకున్న సీఐ - si pulls sachivalayam employee collar
జమ్మలమడుగులో సచివాలయ ఉద్యోగులుకు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. సచివాలయానికి భోజనం తీసుకెళ్లే క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. సహనం కోల్పోయిన ఎస్సై ఉద్యోగి కాలర్ పట్టుకున్నాడు. దీంతో సచివాలయ ఉద్యోగులందరూ ఆందోళన బాట పట్టారు.
కాలర్ పట్టుకున్న ఎస్సై