Kadapa Sub Registrar Shyamala Devi: అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్‌కు కేటాయించిన ప్రభుత్వ భూములను.. వైఎస్సార్సీపీ నాయకులకు అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ శ్యామలాదేవికి ఉన్నతాధికారులు మళ్లీ తిరిగి అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. నెలన్నర కిందట డిసెంబరు 19న రాయచోటిలోని 13 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులకు కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిష్ట్రేషన్ చేశారు. దీనిపై ఈనాడు-ఈటీవీ భారత్‌లలో వరస కథనాలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు.
యథాస్థానానికే కడప సబ్ రిజిస్ట్రార్ శ్యామల దేవి.. నెలన్నర తర్వాత - Latest Telugu News
Kadapa Sub Registrar : రాయచోటి కలెక్టరేట్‌కు చెందిన ప్రభుత్వ భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ మళ్లీ యథాస్థానానికే చేరుకున్నారు. కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ విధులు నిర్వహించిన ఆమె అక్రమాలకు పాల్పడటంతో బదిలీ చేశారు. ఎంతో కాలం బదిలీ చేసిన స్థానంలో ఉంచలేదు.. మళ్లీ పాత స్థానానికే బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆరుగురు వైఎస్సార్సీపీ నాయకులు, రిజిస్ట్రేషన్ చేసిన కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ శ్యామలాదేవిపై రాయచోటి పోలీసులు డిసెంబరు 25న క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన మరుసటి రోజే శ్యామలాదేవిపై బదిలీ వేటు వేశారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ కార్యాలయానికి బదిలీ చేశారు. నెలన్నర తర్వాత ఇపుడు మళ్లీ యథాస్థానానికే శ్యామలాదేవికి పోస్టింగ్ ఇస్తూ డీఐజీ ఉత్తర్వులు ఇవ్వడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవీ చదవండి :