కడప జిల్లా రాజంపేటలో పలు చౌక ధరల దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు పని చేయకపోవడంతో ప్రజలు మండుటెండల్లో ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని బండ్రాళ్ళవీధి, ఎర్రబల్లి, బంగ్లా వీధి తదితర ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు మొరాయించాయి. చౌకధరల సరకుల కోసం ప్రజలు ఉదయం ఆరు గంటల నుంచే దుకాణాల వద్ద బారులు తీరారు. అయితే యంత్రాలు పని చేయనందున చేసేదేమీ లేక వెనుతిరుగుతున్నారు.
మొరాయిస్తున్న ఈ-పాస్ యంత్రాలు... లబ్ధిదారులకు కష్టాలు - epass mechines
పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం పేదలకు అందని ద్రాక్షగా మారుతోంది. కడప జిల్లా రాజంపేటలో కొన్ని చౌక ధరల దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు పని చేయడం లేదు. ఫలితంగా లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
![మొరాయిస్తున్న ఈ-పాస్ యంత్రాలు... లబ్ధిదారులకు కష్టాలు shouting-e-pass-machines-dot-dot-dot-beneficiaries-are-hard](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6611768-3-6611768-1585664855652.jpg)
ఈ పాస్ యంత్రాలతో లబ్ధిదారుల కష్టాలు