లారీ ఢీకొని 60 గొర్రెలు మృతి - lorry pulty in veerapunaini palle taaza
కడప జిల్లా పాయసం పల్లె వద్ద గొర్రెల మందను లారీ ఢీకొట్టగా... సుమారు 60 జీవాలు అక్కడికక్కడే మృతి చెందాయి. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
పాయసం పల్లె వద్ద లారీ ఢీకొని సుమారు 60 గొర్రెలు మృతి
కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం పాయసం పల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కలింగర కాయలతో వెళ్తోన్న లారీ... గొర్రెల మందను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 60 కి పైగా జీవాలు మృతి చెందినట్లు కాపరి తెలిపాడు. వీటి విలువ సుమారు 5 లక్షలకు పైగా ఉంటుందని ఆవేదన చెందాడు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారీ అయ్యాడు.