దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో ఉన్న వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద వైఎస్ షర్మిల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భర్త అనిల్‌కుమార్, తల్లి విజయమ్మ, వైఎస్ వివేకా కుమార్తె సునీత తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. షర్మిల తెలంగాణలో ఇవాళ వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ పార్టీ (YSRTP) ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు చేశారు. అనంతరం ఆమె కడప నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం బేగంపేటకు చేరుకుంటారు.
ఇడుపుల పాయలో వైఎస్ఆర్కు షర్మిల ఘన నివాళి
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమార్తె షర్మిల.. ఇడుపుల పాయ వద్ద నివాళులర్పించారు. వైఎస్ ఘాట్ వద్దకు విజయయమ్మ, వైఎస్ వివేకా కుమార్తె సునీత, అనిల్ కుమార్ చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాగా ఈరోజు షర్మిల కొత్త పార్టీ ప్రకటన చేయనున్నారు.
వైఎస్‌ఆర్
పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి సాయంత్రానికి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ కేంద్రానికి చేరుకుంటారు. వేదికపైన తెలంగాణ అమరవీరుల స్తూపానికి, వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ స్థాపన లక్ష్యాలు, ఎజెండాపై ఆమె ప్రసంగించనున్నారు.
ఇదీ చదవండి:YSRTP: నేడే వైఎస్ షర్మిల కొత్త పార్టీ అధికారిక ప్రకటన
Last Updated : Jul 8, 2021, 9:49 AM IST