ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల వైఎస్‌ అభిమానులతో షర్మిల భేటీ - sharmeela new party updates

హైదరాబాద్‌లో రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో వైఎస్‌ షర్మిల ఇవాళ సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలతో శుక్రవారం సమావేశమయ్యారు. మార్చి 2న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. వైఎస్‌ హయాంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోనున్నారు.

sharmeela meet rangareddy leaders
వైఎస్‌ అభిమానులతో షర్మిల భేటీ

By

Published : Feb 20, 2021, 9:00 AM IST

తెలంగాణలోని వైఎస్‌ఆర్‌ అభిమానులతో వైఎస్‌ షర్మిల ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలతో భేటీ అవుతున్న ఆమె... భవిష్యత్తు కార్యాచరణపై వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలతో శుక్రవారం సమావేశమయ్యారు. శనివారం హైదరాబాద్‌లో రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో సమావేశంకానున్నారు. దీనికి ముఖ్యులంతా హాజరయ్యేలా ఏర్పాట్లుచేస్తున్నారు.

మార్చి 2న మరోసారి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలతో సమావేశం కావాలని నిర్ణయించిన షర్మిల, ఈ సందర్భంగా వైఎస్‌ హయాంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోనున్నారు. తక్కువ నిధులతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశమున్నా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఇప్పటికే కొందరు ఆమె దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించం ద్వారా సమగ్ర సమాచారాన్ని సేకరించి, క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహనతో ముందుకు వెళ్లేందుకు వీలుగా ఆమె ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పార్టీ వర్గాల భోగట్టా. వీలైనంత త్వరగా పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలోనూ షర్మిల ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

జగన్‌, చంద్రబాబు.. అందరినీ కలుపుకొని పోరాడాలి: నారాయణ

ABOUT THE AUTHOR

...view details