కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్జీఎఫ్ అండర్-19 ఆటల పోటీలను కళాశాల ప్రిన్సిపల్ ఎస్.వి.రమణ ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేయనున్నారు. పోటీలకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు. ఇక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులకు అక్టోబర్ 4న జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో అవకాశం కల్పించనున్నారు. అనంతరం బాక్సింగ్, థాయ్ బాక్సింగ్ క్రీడలు నిర్వహించి క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలను అనంతపురంలోనూ... థాయ్ బాక్సింగ్ పోటీలను రాజంపేటలో నిర్వహిస్తామని తెలిపారు.
రాజంపేటలో.. ఎస్జీఎఫ్ అండర్ -19 క్రీడా పోటీలు ప్రారంభం - games in rajampeta government college
ఎస్జీఎఫ్ అండర్ - 19 ఆటల పోటీలను కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎస్.వి.రమణ ప్రారంభించారు. ఖోఖో, థాయ్ బాక్సింగ్, బాక్సింగ్ క్రీడలకు పోటీలు నిర్వహించారు.
క్రీడల పోటీలు