ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గల్ఫ్ బాధితులను ఆదుకోవాలి' - రాజంపేటలో ప్రజాసంఘాల నాయకుల ఆందోళన

కడప జిల్లా రాజంపేటలో ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. గల్ఫ్ దేశాల్లో కష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రజలను సొంతగ్రామాలకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

sfi leaders protest at rajampeta in kadapa
రాజంపేటలో ఎస్ఎప్​ఐ నాయకుల ధర్నా

By

Published : May 31, 2020, 10:57 PM IST

గల్ఫ్ దేశాల్లో అష్టకష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రజలను... స్వరాష్ట్రానికి తీసుకురావాలని సీఐటీయూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కడప జిల్లా రాజంపేటలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పొట్టకూటి కోసం వలస వెళ్లిన తెలుగు ప్రజలు పనుల్లేక, తిండి లేక, అద్దెలు చెల్లించలేక నరకయాతన అనుభవిస్తున్నారని నాయకులు అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వలస కూలీల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆగ్రహించారు. వారిని రాష్ట్రానికి తీసుకొచ్చి ఉపాధి అవకాశాలను కల్పించాలన్నారు. వలస కూలీలను పట్టించుకోపోతే... రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details