కడప నగరంలోని బాలాజీ నగర్ ప్రజలను.. గత ఏడాది నుంచి మురుగు సమస్య వెంటాడుతోంది. ఈ ప్రాంతంలో కాలువలు లేని కారణంగా మురుగునీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. గతంలో లోతట్టు ప్రాంతాల్లోకి ఈ నీరు వెళ్లేది. కానీ ఆ స్థల యజమాని మురుగునీరు రాకుండా మట్టి అడ్డు వేసిన కారణంగా... నీరంతా రోడ్ల పైకి చేరుతోంది.
వాహనదారులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కరోనాతో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. దీనికి తోడు ఈ మురుగు నీటి సమస్య మరింత జటిలమయ్యింది. స్థానికంగా ఉన్న వారు దుర్వాసన భరించలేక అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.