ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నివర్ బీభత్సం: కడపలో నేలకొరిగిన భారీ వృక్షం - రాజంపేటపై నివర్ ప్రభావం

నివర్ తుఫాన్ ప్రభావంతో కడప జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తుపాను వల్ల నగరంలో ఒక్కసారిగా భారీ వృక్షం నేలకొరిగింది. రాజంపేట పట్టణంలో మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయి.

Sewage on Rajampet roads
రాజంపేట రోడ్లమీద పొంగిపొర్లుతున్న మురుగుకాలువలు

By

Published : Nov 26, 2020, 2:24 PM IST

తపాలా కార్యాలయం వద్ద మురుగునీరు

నివర్ ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానల ధాటికి కడప జిల్లా రాజంపేటలో మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద రహదారులు మురుగుమయమయ్యాయి. వాహనచోదకులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మండలంలోని వివిధ ప్రాంతాల్లో కల్వర్టులు పొంగుతున్నాయి.

విరిగిపడిన మహావృక్షం

కడపలో పట్టణంలోనూ ఎడతెరిపి లేకుండా ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కడప రైల్వే స్టేషన్లో రోడ్​లో ఉన్న మహా వృక్షం ఒక్కసారిగా నేలకూలింది. ఆ సమయానికి ఒక కారు వెళ్లడంతో ఆ కారుపై చెట్టు కొమ్మ విరిగి పడింది. అదృష్టవశాత్తు ఎలాంటి నష్టం జరగలేదు. కారు దెబ్బతింది. విషయం తెలిసిన అధికారులు విరిగిన చెట్టును తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. విద్యుత్ శాఖ అధికారులు ... సహాయ చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details