కడప జిల్లా మైదుకూరు మండలం జీవీసత్రం వద్ద బెంగళూరుకు ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న టాటా సుమో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేయగా... మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. నిందితుడి నుంచి రూ. 2లక్షల విలువైన ఏడు ఎర్రచందనం దుంగలను సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జీవీ సత్రంలో ఏడు ఎర్రచందనం దుంగలు పట్టివేత - kadapa district crime
కడప జిల్లా జీవీసత్రం వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు, ఓ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
జీవీసత్రంలో ఏడు ఎర్రచందనం దుంగలు పట్టివేత