సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మధ్యంతర బెయిల్పై కడప కేంద్ర కారాగారం నుంచి ఏడుగురు ఖైదీలు విడుదలకు అర్హత సాధించారు. కానీ ప్రత్యేక మహిళా కారాగారం నుంచి ఏ ఒక్క మహిళా ఖైదీ విడుదలకు అర్హత సాధించలేదు. కరోనా నేపథ్యంలో జైల్లో ఖైదీల సంఖ్యను తగ్గించేందుకు సుప్రీంకోర్టు అర్హత ఉన్నవారికి 90 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
కడప జైలు అధికారులు దస్త్రాలన్నింటినీ పరిశీలించి అర్హత ఉన్న ఏడుగురు ఖైదీల జాబితాను సిద్ధం చేశారు. నలుగురు జీవిత ఖైదీలు.. ముగ్గురు రిమాండ్ ఖైదీలు ఉన్నారు.