ఎర్రచందనం దుంగలు పట్టివేత..విలువ ఎంతంటే..! - కడప జిల్లా
15:49 September 15
ఎర్రచందనం దుంగల పట్టివేత-అదుపులో ఏడుగురు
కడప జిల్లా రైల్వే కోడూరు మండలం మారావారి పల్లి - వెంకట రెడ్డి పల్లిలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై పోలీసులు పంజా విసిరారు. అక్రమంగా తరలిస్తున్న 40 లక్షల రూపాయల విలువైన 22 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ కు ఉపయోగించిన ఒక ఆటో, ఒక కారు, ఒక ఐచర్ వాహనాన్ని రైల్వేకోడూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కొంతమంది నిందితులు తమను చూసి పారిపోయారని పోలీసులు తెలిపారు. పారిపోయిన ఎర్రచందనం స్మగ్లర్ల కోసం ప్రత్యేక దళాలు అడవిలో గాలింపు చేస్తున్నాయని వెల్లడించారు. పట్టుబడిన ఏడుగురు స్మగ్లర్లు స్థానిక గ్రామాల వారిగా గుర్తించామన్నారు.
ఇదీ చదవండి:Smugglers: రూ.కోటి విలువ చేసే ఎర్రచందనం పట్టివేత.. ఆరుగురు స్మగ్లర్ల అరెస్ట్