కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక్కరోజే 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం పట్టణ వాసులను ఆందోళన కలిగిస్తోంది. 21 మంది అనుమానితుల నుంచి వైద్యులు నమూనాలు సేకరించి తిరుపతిలోని ల్యాబ్‌కు పంపారు. ఇందులో ఏడుగురికి కరోనా ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఇటీవల దిల్లీలో జరిగిన మతపరమైన సమావేశాలకు వెళ్లి రావడంతో.. వీరికి వైరస్ సోకిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్లనుంచి బయటకు రాకుండా కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ప్రొద్దుటూరులో ఏడుగురికి కరోనా పాజిటివ్ - prodhuttoru corona updates
కడప జిల్లా ప్రొద్దుటూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కలవరపరుస్తోంది. ఒక్కరోజే ఏడుగురికి కరోనా సోకడంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు.
ప్రొద్దుటూరులో ఏడుగురికి కరోనా పాజిటివ్