కడపలో అత్యధికంగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావటంపై అధికారుల అప్రమత్తమయ్యారు. ప్రొద్దుటూరు, ముద్దనూరు వైపు నుంచి వచ్చిన వాహనాలను నిశితంగా తనిఖీలు చేశారు. రెండు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక యంత్రం సహాయంతో హైపోక్లోరైట్ ద్రావణాన్ని రోడ్లపై పిచికారీ చేయించారు. తాడిపత్రి రోడ్డు, ముదునూరు, ప్రొద్దుటూరు రహదారుల్లో ఈ ద్రావణాన్ని భారీ ఎత్తున పిచికారీ చేయించారు. జమ్మలమడుగు పట్టణంలో కరోనా కట్టడికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
కరోనా: కడపలో జిల్లాలో అధికారులు అప్రమత్తం - #corona list inAP
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక్కసారిగా 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంపై జమ్మలమడుగు అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రొద్దుటూరు, ముద్దనూరు వైపు నుంచి వచ్చే వాహనాలను ఆపేశారు.
![కరోనా: కడపలో జిల్లాలో అధికారులు అప్రమత్తం serious action taken in kadapa about corona cases rising](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6641421-1107-6641421-1585889905008.jpg)
కడపలో పారిశుధ్యంపై పటిష్ట చర్యలు