కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి అధికారులు వలసకూలీలను తరలించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 98 మందిని పంపారు. మూడు బస్సుల ద్వారా ఆర్టీసీ బస్టాండ్ నుంచి వారిని స్వస్థలాలకు తరలించారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి బస్సులో ఎక్కించారు. ప్రొద్దుటూరు డీఎస్పీ సుధాకర్, తహసీల్దారు చెండ్రాయుడు దగ్గరుండి వారిని పంపారు. తమ స్వస్థలాలకు వెళుతుండటంతో వలస కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రొద్దుటూరు నుంచి పశ్చిమబెంగాల్‌కు వలసకూలీల తరలింపు - sending migrants from Produttur to West Bengal
కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి పశ్చిమబెంగాల్‌కు వలసకూలీలను తరలించారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి మూడు బస్సుల ద్వారా ఆర్టీసీ బస్టాండ్ నుంచి వారిని స్వస్థలాలకు తరలించారు.
ప్రొద్దుటూరు నుంచి పశ్చిమబెంగాల్ కు వలసకూలీలు తరలింపు