కడపలో హోంగార్డుల ఎంపిక ప్రారంభం
కడప జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో హోం గార్డుల ఎత్తు అర్హత పరీక్షలకు తొలిరోజు 1,519 మంది హాజరైనట్లు ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రతిభ ఆధారంగా, పారదర్శకంగా జరుగుతుందని ఎస్పీ అన్నారు.
కడప జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో హోం గార్డుల ఎత్తు అర్హత పరీక్షలకు తొలిరోజు 1,519 మంది హాజరు అయినట్లు ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. అభ్యర్థులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మహిళా అభ్యర్థులు జనరల్ ఓసీ, బీసీ, ఎస్సీ అభ్యర్థులు 150 సెంటి మీటర్ల ఎత్తు, ఉండాలని.. ఎస్‌టీ మహిళా అభ్యర్థులు 145 సెంటీమీటర్లు ఎత్తు కలిగి ఉండాలని ఎస్పీ తెలిపారు. పురుష అభ్యర్థులందరికీ ఎత్తు 165 సెంటీమీటర్ల నుంచి 160 సెంటీమీటర్లకు సవరించినట్లు పేర్కొన్నారు. 20 .01.2021 న గైర్హాజరైన అభ్యర్థులు ఈ నెల 21, 22, 23, 24 తేదీలలో ఎత్తు అర్హత పరీక్షకు హాజరు కావచ్చని తెలిపారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రతిభ ఆధారంగా, పారదర్శకంగా జరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు.