కడప జిల్లా రాజంపేటలో ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 123 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన సమారు 80 మంది స్మగ్లర్లు ఈ నెల 24న బయలుదేరి రాజంపేట అటవీ డివిజన్ పరిధిలో రాళ్లమడుగు బీట్ ప్రాంతంలో తీగలకోనకు చేరుకున్నారు. ఈ దాడిలో 8 మంది పట్టుబడ్డారు.
మిగిలిన వారు పరారయ్యారు. నాలుగు టన్నుల బరువున్న 123 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని.. వాటి విలువ రూ. పది లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. మార్కెట్లో వీటి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరిచామని.. పరారైన వారిని పట్టుకునేందుకు కూంబింగ్ చేస్తున్నామని తెలిపారు.