కడప జిల్లా రాజుపాళెం మండలం కుమ్మరపల్లె బైపాస్ రోడ్డులో వై జంక్షన్ సమీపంలోని మోరీల వద్ద 8 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాపాడు మండలం ఖాదర్‌పల్లెకు చెందిన షేక్ సింపతిలాల్ బాషా, షేక్ ఫకృవల్లి, షేక్ మహబూబ్ బాషాలు కుమ్మరపల్లె సమీపంలోని మోరీల వద్ద దుంగలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం దాడులకు దిగినట్లు ప్రొద్దుటూరు సీఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. వీటి విలువ 4.50 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు.
ఎర్రచందనం దుంగలు తరలింపు.. ముగ్గురు అరెస్ట్ - kadapa dst red sandalwood taja news
కడప జిల్లా రాజుపాళెం మండలం కుమ్మరపల్లె సమీపంలో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ప్రొద్దుటూరు సీఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు.
![ఎర్రచందనం దుంగలు తరలింపు.. ముగ్గురు అరెస్ట్ seized red sandalwood in kadapa dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8175241-1007-8175241-1595727420494.jpg)
seized red sandalwood in kadapa dst