కడప జిల్లా రైల్వేకోడూరు మండలం సూరపరాజుపల్లె సమీపంలో ఐదు లక్షల రూపాయలు విలువైన ఎర్ర చందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఒక ఆటోను, అబ్బిరాజుపల్లి గ్రామానికి చెందిన పెంచలయ్య అనే స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి 19 ఎర్రచందనం దుంగలు పట్టుకున్నామని రాజంపేట డీఎస్పీ భాస్కర్‌రెడ్డి వెల్లడించారు. మరికొంత మంది స్మగ్లర్లు పారిపోయారని.. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సూరపరాజుపల్లె సమీపంలో 19 ఎర్రచందనం దుంగలు పట్టివేత - సూరపరాజు పల్లె
కడప జిల్లా రైల్వే కోడూరు మండలం సూరపరాజుపల్లె సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 19 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. మరికొంతమంది స్మగ్లర్లు పారిపోగా..ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
సూరపరాజు పల్లె సమీపంలో 19 ఎర్రచందనం దుంగల పట్టివేత
TAGGED:
Suraparaju village