ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.7.20 లక్షల విలువైన రేషన్​ బియ్యం పట్టివేత - Vigilance officials ride at vempalli

కడప జిల్లా వెంపల్లిలో లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 7.20 లక్షలు ఉంటుందని విజిలెన్స్​ ఎస్సై రంగస్వామి వెల్లడించారు.

ration rice seized at kadapa
వెంపల్లిలో రేషన్​ బియ్యం పట్టివేత

By

Published : Jul 11, 2021, 5:08 PM IST

కడప జిల్లా వెంపల్లి పట్టణంలోని పులివెందుల బైపాస్​ వద్ద విజిలెన్స్ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 7 లక్షల 20 వేల విలువ చేసే 400 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు విజిలెన్స్ ఎస్సై రంగస్వామి వెల్లడించారు. చెన్నూరు మండలానికి చెందిన బ్రహ్మయ్య.. ఇక్కడ తక్కువ ధరలకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రం తరలించి అక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు.

విజిలెన్స్ ఏఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తూ.. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు ఎస్సై వివరించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details