రాయలసీమ పర్యటనలో ఉన్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముని ఆలయాన్ని దర్శించుకున్నారు. నిన్న రాత్రి ఒంటిమిట్ట చేరుకున్న రమేశ్‌కుమార్.. ఇవాళ ఉదయం స్వామివారి అభిషేక పూజల్లో పాల్గొన్నారు.
స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ పండితులు స్వామివారి విశిష్టత ను రమేష్ కుమార్ కు తెలియజేశారు. ఇక్కడ నుంచి కడప కలెక్టరేట్‌కు చేరుకోనున్న ఆయన.. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేయనున్నారు.