కడప జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని వై.కోట సమీపానున్న అటవీ ప్రాంతంలో.. సుమారు 220 లీటర్ల బెల్లం ఊటను ఎస్‌ఈబీ అధికారులు ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ కోసం బిందెలలో సరకును నిల్వ ఉంచగా గుర్తించినట్లు తెలిపారు. ఎస్పీ అన్బురాజ్, ఏఎస్పీ గౌతమి శాలి ఆదేశాల మేరకు.. ఎస్‌ఈబీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్‌తో పాటు సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
వై.కోటలో భారీగా బెల్లం ఊట ధ్వంసం - వై.కోటలో బెల్లం ఊట ధ్వంసం చేసిన ఎస్‌ఈబీ సిబ్బంది
నాటుసారా తయారీ కోసం ఉపయోగించే బెల్లం ఊటను కడప ఎస్‌సీబీ అధికారులు గుర్తించారు. ఓబులవారిపల్లి మండలం వై.కోటలో సూమారు 220 లీటర్ల ఊటను నాశనం చేశారు.
వై.కోటలో నాటుసారా తయారీ, బెల్లంఊట ధ్వంసం చేసిన ఎస్‌ఈబీ సిబ్బంది