ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు.. భారీగా బెల్లం ఊట ధ్వంసం - కడప జిల్లా తాజా వార్తలు

కడప జిల్లా ఓబులవారిపల్లి మండలంలో నాటు సారా తయారీ కేంద్రాలు, అమ్మకాలపై ఎస్​ఈబీ పోలీసులు దాడులు నిర్వహించారు. మండలంలోని గాదెల అరుంధతీవాడకు సమీపంలోని గచ్చు బావి వద్ద 540 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

seb police ride on natu sara manufacturing centers at nandu
నాటుసారా తయారీ కేంద్రంపై దాడులు

By

Published : May 19, 2021, 5:28 PM IST

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలో నాటు సారా తయారీ కేంద్రాలపై కోడూరు ఎస్​ఈబీ పోలీసులు దాడులు చేశారు. గాదెల అరుంధతీవాడకు సమీపంలోని గచ్చు బావి వద్ద 36 బిందెలలో నిల్వ ఉన్న సుమారు 540 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. బెల్లం ఊట సొంతదారుల ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగుతోందని ఎస్​ఈబీ ఇన్​​స్పెక్టర్ రామ్మెహన్​ తెలిపారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దాడులు చేపట్టినట్లు తెలిపిన ఆయన.. ఎవరైనా అక్రమంగా మద్యం తయారీ, విక్రయం చేసినట్లు తెలిస్తే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని స్థానికులు సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details