రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నందున మద్యం, నాటుసారా అక్రమ రవాణాను నివారించేందుకు ఎన్ఫోర్స్ మెంట్, పోలీసులు అధికారులు చర్యలు చేపట్టారు. కడప ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలతో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ సిబ్బంది... రైల్వే కోడూరు మండలంలో దాడులు నిర్వహించారు. రైల్వే కోడూరు నుంచి తిరుపతికి వెళ్లే మార్గంలో సంచుల్లో అక్రమంగా నాటుసారాను తరలిస్తున్న ఇద్దర్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 40 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
రైల్వే కోడూరులో నాటుసారా సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్ట్
కడప జిల్లా రైల్వే కోడురు మండలంలో అక్రమంగా మద్యం, నాటుసారా సరఫరా చేస్తున్న వారి కోసం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 40 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్నారు.
నాటుసారా సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్ట్