ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ దాడులు..నలుగురు అరెస్ట్ - కడప తాజా వార్తలు

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. నాలుగు వందల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి...నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

seb-officers-raids-on-natusara-bases-in-the-railway-koduru
రైల్వే కోడూరు మండలంలో నాటుసారా స్థావరాలపై దాడులు

By

Published : Sep 25, 2020, 1:57 PM IST


కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్, ఏఎస్పీ చక్రవర్తి ఆదేశాల మేరకు... గత రెండు రోజులుగా రైల్వే కోడూరు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ ఇన్​స్పెక్టర్​ రామ్మోహన్ తమ సిబ్బందితో కలిసి నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి... నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులపై కోడూరు ఎస్ఈబీ స్టేషన్ నందు కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. రేపు నందలూరు కోర్టులో హాజరుపరచనున్నారు.

ABOUT THE AUTHOR

...view details