ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వేకోడూరు మండలంలో ఎస్​ఈబీ అధికారులు దాడులు - రైల్వేకోడూరు మండలంలో కర్ణాటక మద్యం పట్టివేత వార్తలు

కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలో ఎస్​ఈబీ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ ,కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

SEB officers raids  at  Railwaykoduru zone
రైల్వేకోడూరు మండలంలో ఎస్​ఈబీ అధికారులు దాడులు

By

Published : Oct 23, 2020, 10:49 PM IST

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. రాఘవరాజపురం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఈశ్వరయ్య అదుపులోకి తీసుకుని ..అతని నుంచి 5 కర్ణాటకకు చెందిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఇన్​స్పెక్టర్ రామ్మోహన్ తెలిపారు.

కోడూరు నుంచి చిట్వేలు బస్సు మార్గంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. బ్రిడ్జి వద్ద కోడూరు మండలం బయనపల్లికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 8 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కోడూరు మండలం, ఓబులవారిపల్లె మండలం, చిట్వేలు మండల ప్రజల వారని హెచ్చరించారు.

ఇదీ చూడండి.కావలిలో రియల్ మాఫియా...గ్రావెల్ దందా!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details