ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Viveka Murder Case: వివేకా హత్య కేసు..సీబీఐ అధికారుల సీన్ రీకన్​స్ట్రక్షన్‌ - మాజీ మంత్రి వివేకా హత్యకేసు తాజా సమాచారం

వైఎస్​ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. హంతకులను గుర్తించేందుకు అవసరమైన ఆధారాలు సేకరిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిని అరెస్ట్ చేయగా.. మరికొందరు నిందితుల అరెస్టుకు ప్రయత్నాలు చేస్తోంది. వివేకా ఇంట్లోకి నిందితులు ఏవిధంగా ప్రవేశించారు, హత్య చేసి ఎలా పారిపోయారనే అంశంపై మరోమారు సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేసింది.

1
1

By

Published : Sep 14, 2021, 8:42 PM IST

Updated : Sep 15, 2021, 4:46 AM IST

వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు(viveka murder case)లో పక్కా ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. 2019 మార్చి 15న తెల్లవారుజామున వివేకా హత్య జరిగింది. మార్చి 14వ తేదీ రాత్రి వివేకా ఇంట్లోకి ప్రవేశించిన నిందితుల వివరాలను సీబీఐ సేకరించింది. మంగళవారం సాయంత్రం సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్, డీఎస్పీ దీపక్ గౌర్ ఆధ్వర్యంలో బృందం మరోమారు వివేకా ఇంటిని పరిశీలించి సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేసింది. వివేకా హత్య జరిగిన బాత్ రూం, బెడ్ రూం ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. ఇంటిని కొలతలు వేసి వీడియో, ఫొటోలు తీశారు. ఈ సమయంలో వివేకా కుటుంబ సభ్యులు లేకపోగా... ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే ఇనయతుల్లా ఉన్నారు. హత్య జరిగిన ముందు రోజు రాత్రి వివేకా ఇంటికి సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి పల్సర్ బైకులో గొడ్డలి తీసుకుని వచ్చినట్లు ఇటీవల పులివెందుల కోర్టుకు సమర్పించిన రిమాండు రిపోర్టులో సీబీఐ పేర్కొంది. మరికొందరు నిందితులు ఇంట్లోకి వచ్చారనే సమాచారం మేరకు సీబీఐ ట్రయల్ నిర్వహించింది. వైఎస్‌ వివేకానందరెడ్డితోపాటు మరో నలుగురు నిందితుల పేర్లతో కూడిన ఆంగ్ల అక్షరాలను ఐదుగురు సీబీఐ అధికారుల చొక్కాలకు అతికించి ట్రయల్ నిర్వహించారు.

సీబీఐ నిర్వహించిన ట్రయల్స్ ప్రకారం... హత్య జరిగిన ముందు రోజు రాత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి కారులో ఇంటికి చేరుకున్నారు. ఆయన వచ్చిన తర్వాత చాలా సేపటికి ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని... ఉమాశంకర్‌రెడ్డి పల్సర్ బైకులో తీసుకుని వచ్చాడు. గేటు వద్ద దిగిన ఎర్ర గంగిరెడ్డి వివేకా ఇంట్లోకి వెళ్లగానే... ఉమాశంకర్‌రెడ్డి వెళ్లిపోతాడు. తర్వాత సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి పల్సర్ బైకులో వస్తారు. వారు కూడా లోపలికి వెళ్లాక... షేక్ దస్తగిరి వేరే మార్గంలో వివేకా ఇంటికి చేరుకుంటారు. హత్య జరిగిన తర్వాత వారంతా బైకులో పారిపోయినట్లుగా సీబీఐ అధికారులు వీడియో తీశారు.

వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిని అరెస్ట్ చేయగా... డ్రైవర్ దస్తగిరిని 164 కింద మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పించారు. హత్యాస్థలంలో దస్తగిరి ఉన్నట్లు భావిస్తే... ఏ క్షణమైనా అరెస్ట్ చూపే అవకాశం ఉంది. అలాగే ఎర్ర గంగిరెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రెండేళ్ల కిందట ఐపీసీ సెక్షన్ 201 కింద... సాక్ష్యాలు తారుమారు చేశారనే కేసులో గంగిరెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిలుపై ఉన్నారు. సెక్షన్ 302 హత్యానేరం కింద మరోమారు అరెస్ట్ చేయాలంటే... బెయిలు రద్దు కావాల్సి ఉంటుంది. దీనికి సాంకేతికంగా జాప్యం జరగవచ్చని తెలుస్తోంది.

ఇదీ చదవండి

CM JAGAN: వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం రాకూడదు: సీఎం జగన్​

Last Updated : Sep 15, 2021, 4:46 AM IST

ABOUT THE AUTHOR

...view details