ఎస్సీ వర్గీకరణ కుదరదని అసెంబ్లీ సాక్షిగా ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం తీవ్ర అన్యాయం అని వెంటనే వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మాదిగలను మోసం చేయడం జగన్మోహన్రెడ్డికి తగదని పేర్కొన్నారు. అంతేగాక ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు బీసీ కృష్ణయ్య గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రిపై భగ్గుమన్న ఎస్సీలు - CM speech at assembly
ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ... కడప జిల్లా కమలాపురం పట్టణంలో ఎమ్మార్వో ఆఫీస్ ప్రాంగణము బయట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు.
నిరసనలు చేస్తున్న ఎస్సీలు