ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ పరిహారం పేరుతో మోసం.. కోట్లు కొల్లగొడుతున్న అంతర్జాతీయ ముఠా - కోవిడ్ మృతుల పరిహారం

International gang frauds: కొవిడ్ మృతులకు పరిహారం పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠాను కడప పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు దిల్లీ కేంద్రంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అమాయకులను నమ్మించి మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్​లో వాట్సాప్​లో వచ్చే లింక్​ల​ను చూసి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

International gang frauds
కోవిడ్ మృతులకు పరిహారం పేరుతో మోసాలు

By

Published : Oct 23, 2022, 4:19 PM IST

Awareness of cyber crime: కోవిడ్​తో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అందించే వైఎస్ఆర్ బీమా సొమ్మును అందజేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న అంతర్జాతీయ ముఠా సభ్యులను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ రాకెట్ నిర్వహిస్తున్న నలుగురు ముఠా సభ్యులను ఇవాళ కడప పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరి వద్ద 73 సిమ్ కార్డులు, సెల్ ఫోన్లు, నాలుగు లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో ఉన్న మరికొందరు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని అదనపు ఎస్పీ తుషార్ డూడి వెల్లడించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ లింక్‌లను చూసి మోసపోవద్దని ఏఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details