ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దళిత మహిళ మృతిపై నిరసన... 21మంది తెదేపా నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసు - తెదేపా నేతలపై అట్రాసిటీ కేసులు కడప

గతేడాది నాగమ్మ అనే దళిత మహిళ మృతిపై నిరసన తెలిపినందుకు గాను 21 మంది తెదేపా నాయకులపై పులివెందులలో ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నాగమ్మ హత్యపై తమ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించారంటూ ఆమె తల్లి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు ఎఫ్​ఐఆర్​ లో పేర్కొన్నారు.

tdp
21 మంది తెదేపా నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

By

Published : Jan 2, 2021, 11:38 AM IST

దళిత మహిళ నాగమ్మ మృతిపై నిరసన తెలిపిన 21 మంది తెదేపా నాయకులపై పులివెందుల పోలీసు స్టేషన్​లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతేడాది డిసెంబరులో లింగాల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన నాగమ్మ(45) హత్యపై తమ కుటుంబ పరువుకు భంగం కలిగించారంటూ నాగమ్మ తల్లి నల్లరామయ్యగారి పుల్లమ్మ ఫిర్యాదు చేసినట్లు ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్​ 19వ తేదీన పులివెందుల పట్టణంలోని ఆర్​అండ్​బీ అతిథి గృహం నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ , నిరసన కార్యక్రమం చేపట్టిన వారిపై కేసు నమోదు చేయాలంటూ ఆమె ఫిర్యాదు చేశారు.

తెదేపా కడప పార్లమెంట్​ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్​ రాజు, ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్​రెడ్డితో పాటు తెదేపా తెలుగు మహిళా విభాగం కడప పార్లమెంట్​ అధ్యక్షురాలు శ్వేతారెడ్డి, మరో వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:ఎమ్మెల్యే నీచంగా మాట్లాడుతున్నారు: అపరాజిత

ABOUT THE AUTHOR

...view details