ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డప్పు చర్మకారుల ధర్మపోరాట దీక్ష - కడపలో ఎస్సీల ధర్మపోరాట దీక్ష

కడప జిల్లాలో డప్పు చర్మకారులు ధర్మపోరాట దీక్ష చేపట్టారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

darma porata deeksha
డప్పు చర్మకారుల ధర్మపోరాట దీక్ష

By

Published : Feb 4, 2020, 8:52 AM IST

Updated : Feb 4, 2020, 10:49 AM IST

డప్పు చర్మకారుల ధర్మపోరాట దీక్ష

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని... కడప జిల్లా మైదుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట డప్పు చర్మకారులు ధర్మపోరాట దీక్ష చేపట్టారు. సీఎం జగన్ అఖిలపక్ష బృందాన్ని దిల్లీకి తీసుకెళ్లి... ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎస్సీ వర్గీకరణ చట్టబద్దతపై చర్చించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీలకు మంజూరు చేసిన భూములు తిరిగి తీసుకోకుండా కొత్త చట్టం తేవాలని డప్పు చర్మకారుల రాష్ట్ర కన్వీనర్ కే.నాగభూషణం డిమాండ్ చేశారు. కొత్తగా మంజూరు చేసిన పింఛన్లలో డప్పు చర్మకారులెవ్వరికి మంజూరు చేయకపోవడాన్ని ఆయన ఖండించారు.

ఇదీ చదవండి:'మిగతా భూమిని అర్హులకే అప్పగించండి'

Last Updated : Feb 4, 2020, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details