కడప జిల్లా చిట్వేలు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎస్సీ సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. మండలంలోని ఎస్సీల భూములను తహసీల్దార్ ఖాజాబీ ఇతర వర్గాల వారికి ఆన్లైన్ చేసి తమకు కాకుండా చేశారంటూ ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని తహసీల్దార్ ఖాజాబీని విధుల నుంచి తొలగించాలని పేర్కొన్నారు. ఎస్సీలకు చెందిన భూములను తమకే కేటాయించాలని తెలిపారు. లేకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎస్సీల ఆందోళన - కడప జిల్లా తాజా వార్తలు
తమ భూములను తహసీల్దార్ ఖాజాబీ ఇతర వర్గాల వారికి కేటాయించారంటూ చిట్వేలు మండలంలోని ఎస్సీ సంఘ నాయకులు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను తమకు కేటాయించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్‌ను విధుల నుంచి బహిష్కరించాలని పేర్కొన్నారు.

తహసీల్దార్‌ను విధుల నుంచి బహిష్కరించాలంటూ చిట్వేలు మండలం ఎస్సీలు ధర్నా