ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బకాయిలు విడుదల చేయండి ...ఆర్టీసీని ఆదుకోండి - rtc employees union

ఆర్థికంగా చితికిపోయిన ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలని, సంస్థకి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్​ చేశారు. ఆర్టీసీ పాలకమండలిని భాగస్వామ్యం చేయడమే కాకుండా మంత్రి సమక్షంలో అంగీకరించిన డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె బాట పడతామని కడప జిల్లా మైదకూరులో జాయింట్​ యాక్షన్​ కమిటీ ఆధ్వర్యంలో ఎంప్లాయిస్​ యూనియన్​ కార్మికుల ధర్నా చేశారు.

బకాయిలు విడుదల చేయండి ...ఆర్టీసీని ఆదుకోండి

By

Published : May 10, 2019, 1:14 PM IST

కడప జిల్లా మైదుకూరులో జాయింట్​ యాక్ష న్​ కమిటీ ఆధ్వర్యంలో ఎంప్లాయిస్​ యూనియన్​ కార్మికులు ధర్నా చేశారు. ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. అద్దె బస్సులు 35 శాతం పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని ... వాటి స్థానంలో ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టాలన్నారు. అన్ని కేటగిరీల్లో ఖాళీ పోస్టులను రెగ్యూలర్​ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని తెలిపారు. ఆర్టీసీ పాలకమండలిలో కార్మిక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. మంత్రి సమక్షంలో అంగీకరించిన మేరకు అన్ని డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

బకాయిలు విడుదల చేయండి ...ఆర్టీసీని ఆదుకోండి

ABOUT THE AUTHOR

...view details