కడప జిల్లాలోని చక్రాయపేట మండలంలో ఉన్న నాగులగుట్టపల్లెలో తెదేపా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారులు ఎవరూ అధైర్యపడవద్దని.. పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ బీటెక్ రవి అన్నారు. ఎన్నికల్లో నిలిచిన తెదేపా మద్దతుదారులకు ఏ చిన్న సమస్య వచ్చినా.. అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో తెదేపా శాసనమండలి సభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
అధైర్యపడకండి.. అండగా ఉంటాం: బీటెక్ రవి - కడప జిల్లా తెదేపా కార్యకర్తల సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బరిలో తెదేపా మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆ పార్టీ నేతలు తెలిపారు. తెదేపా మద్దతుదారులు ఎవరూ అధైర్యపడవద్దని.. పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ బీటెక్ రవి అన్నారు.
అధైర్యపడకండి.. అండగా ఉంటాం: బీటెక్ రవి