ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్తపల్లిలో విజేతకు భారీ ఆధిక్యం.. అనుచరుల సంబరం - sarpanch cadidate siva chandra reddy latest news update

ప్రొద్దుటూరులో ఆసక్తి రేపిన మేజర్ పంచాయతీ కొత్తపల్లెలో కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి.. ప్రత్యర్థిపై 3368 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. పంచాయతీ కార్యాలయం వద్దకు ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకుని విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

Victory rally
కొత్తపల్లెలో​ విజయోత్సవ ర్యాలీ

By

Published : Feb 10, 2021, 6:03 PM IST

కొత్తపల్లెలో​ విజయోత్సవ ర్యాలీ

కడప జిల్లా ప్రొద్దుటూరులో మేజర్ పంచాయతీ కొత్తపల్లెలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి ప్రత్యర్థిపై 3368 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియతో.. ఈ స్థానంపై అందరూ ఆసక్తి చూపించారు.

చివరకు భారీ మెజార్టీతో గెలుపొందటంపై శివ చంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. శివ చంద్రారెడ్డి సర్పంచ్​గా విజయం సాధించటంతో ఆయన అభిమానులు.. పంచాయతీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details