కడప జిల్లా చెన్నూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మద్యానికి బానిసై మత్తుకు అలవాటుపడిన తల్లి కొడుకు శానిటైజర్ తాగారు. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చెన్నూరుకు చెందిన విజయలక్ష్మికి ముగ్గురు సంతానం, వీరు కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. తల్లి కొడుకు మద్యానికి బానిస అయ్యారు. కొంతకాలం నుంచి మద్యం అందుబాటులో లేకపోవడం... అధిక ధరలు ఉండడంతో మద్యం తాగలేకపోయారు.దీంతో మత్తు కోసమని తల్లి విజయలక్ష్మి కొడుకు శ్రీ రామ్ నాయక్ ఇద్దరు శానిటైజర్ తాగారు. తీవ్ర అస్వస్థతకు గురైన వీరిద్దరిని కడప రిమ్స్ కు తరలించారు. ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మత్తు కోసం శానిటైజర్ తాగిన తల్లి కొడుకు - కడప వార్తలు
మద్యానికి బానిసైన తల్లి కొడుకు మత్తు కోసం శానిటైజర్ తాగి ప్రాణాలు కొల్పోయిన ఘటన కడప జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది.
శానిటైజర్ తాగి తల్లి కొడుకులు మృతి.. ఎందుకంటే?