కడప జిల్లా మైదుకూరు పురపాలికలో పారిశుద్ధ్య కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు. కొత్తగా విధుల్లోకి తీసుకునే పారిశుద్ధ్య కార్మికుల స్థానంలో గతంలో పని చేసిన వారినే నియమించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పురపాలికలో 40 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తూ ఉండగా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా పరిసరాల పరిశుభ్రతకు అదనపు కార్మికులను నియమించుకునే ప్రక్రియను అధికారులు చేపట్టారు. మైదుకూరు మండలానికి చెందినవారు కాకుండా పొరుగు మండలాలకు చెందిన ఆరుగురు విధుల్లోకి చేరేందుకు రావటంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పురపాలికలో పనిచేసి.. తొలగించిన వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతరులకు అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ పారిశుద్ధ్య కార్మికులు విధులకు గైర్హాజరై నిరసన తెలిపారు. ఈ విషయమై పురపాలిక ప్రజారోగ్య విభాగ బాధ్యురాలు పద్మావతిని ప్రశ్నించగా కార్మికులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
'గతంలో పని చేసిన కార్మికులకే ప్రాధాన్యమివ్వాలి' - kadapa district
మైదుకూరు పురపాలికలో కరోనా నియంత్రణలో భాగంగా పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కాక అదనంగా నియమించుకునే ప్రక్రియను అధికారులు చేపట్టారు. స్థానికులు, గతంలో పని చేసిన కార్మికులకే ప్రాధాన్యం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
గతంలో పనిచేసిన కార్మికులకే ప్రాధాన్యం ఇవ్వాలని కార్మికులు డిమాండు చేస్తున్నారు.