కడప జిల్లా బద్వేలు మండలం బయనపల్లె వద్ద ఇసుక ట్రాక్టర్ల యజమానుల మధ్య గొడవ జరిగింది. బద్వేలుకి చెందిన ఇసుక ట్రాక్టర్ల యజమానులు సిద్ధవటం ప్రాంతం నుంచి వచ్చిన పది ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. సిద్ధవటం పెన్నానదిలో ఇసుక క్వారీ లేకున్నా... నిబంధనలకు వ్యతిరేకంగా తక్కువ ధరకు ఈ ప్రాంతంలో ఎలా ఇస్తారని నిలదీశారు. రేపట్నుంచి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. వచ్చిన ట్రాక్టర్లను తిరిగి వెనక్కి పంపించారు. బద్వేలు ప్రాంతానికి చెందిన ఇసుక క్వారీని నందలూరు వద్ద అనుమతులు ఇచ్చారు. అక్కడనుంచి కాకుండా దగ్గర దూరంలోని సిద్ధవటం పెన్నానదిలో ఇసుక రవాణా చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వారు వాపోయారు.
ఇసుక వివాదం.. ట్రాక్టర్ యజమానుల ఘర్షణ - bayanapalli
కడప జిల్లా బద్వేలుకి చెందిన ఇసుక ట్రాక్టర్ల యజమానులు సిద్ధవటం నుంచి వచ్చిన ఇసుక వాహనాలను అడ్డుకున్నారు. వచ్చిన ట్రాక్టర్లను తిరిగి వెనక్కి పంపించారు. మళ్లీ వస్తే ఊరుకోమని హెచ్చరించారు.
ఘర్షణ పడిన ఇరు వర్గాలకు చెందిన ఇసుక ట్రాక్టర్ల యజమానుల