కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రాజుపేట వద్ద ఇసుక ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. వాహన చోదకుడు పీరయ్య (34) మృతి చెందాడు. తుమ్మపల్లె నది నుంచి బద్వేలుకు ఇసుకతో వెళ్తుండగా.. అదుపు తప్పి అదే ట్రాక్టరు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. పీరయ్యను బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. బ్రహ్మంగారిమఠం పోలీసులు కేసు నమోదు చేశారు.
అదుపు తప్పిన ఇసుక ట్రాక్టర్.. వ్యక్తి మృతి - అదుపు తప్పిన ఇసుక ట్రాక్టర్.. వ్యక్తి మృతి
ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పిన ప్రమాదంలో.. చోదకుడు మృతి చెందిన ఘటన బ్రహ్మంగారిమఠం మండలం రాజుపేటలో జరిగింది.

అదుపు తప్పిన ఇసుక ట్రాక్టర్.. వ్యక్తి మృతి