sand mafia attack: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిన్న తిప్పసముద్రంలో.. ఇసుక మాఫియా బరితెగించింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన అటవీ అధికారులపైనే దాడికి దిగారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో.. మదనపల్లి రేంజ్ పరిధిలోని తరిగొండలో పనిచేస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సుబ్బలక్ష్మి, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజారెడ్డి అక్కడి వెళ్లారు. ఇసుక ట్రాక్టర్‌ను అడ్డుకొన్నారు.
అటవీశాఖ అధికారిపై ఇసుక మాఫియా దాడి - అన్నమయ్య జిల్లాలో ఇసుక మాఫియా దాడి
sand mafia attack: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో ఇసుక అక్రమ వ్యాపారులు దౌర్జన్యం చేశారు. ఏకంగా అటవీశాఖ అధికారులపై దాడి చేశారు. ఈ సంఘటన మదనపల్లి మండలం సీటీఎం సమీపంలో తుమ్మ కొండ ప్రాంతంలో జరిగింది. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏబీఓ అధికారి రాజిరెడ్డి
ఆ తర్వాత సుబ్బలక్ష్మి బైకుపై వెళ్లిపోగా.. అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజారెడ్డి ట్రాక్టర్‌ను కార్యాలయానికి తరలించేందుకు అక్కడే ఉన్నారు. ఈ సమయంలో స్థానికంగా ఉన్న ఇసుక వ్యాపారులు.. రాజారెడ్డిపై దాడి చేసి గాయపరిచారు. ఈ విషయంపై కేసు నమోదు చేశామని మదనపల్లి రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపారు.
ఇవీ చదవండి: