పులివెందుల పట్టణంలో తాము వేసిన రోడ్లే కనిపిస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పేర్కొన్నారు. వైకాపా హయాంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. వేల కోట్లు అప్పులు తెచ్చి చేసే కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరుస్తాయని అభిప్రాయపడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికుల మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'ప్రభుత్వాలు ప్రజల కోసం విజ్ఞతతో పనిచేయాలి' - shilajanath comments on jagan
ప్రభుత్వాలు ప్రజల కోసం విజ్ఞతతో పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్ పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని శైలజానాథ్ స్వాగతించారు.

పీసీసీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్