రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. మరే ఇతర రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
SAJJALA: 'రైతు సమస్యల పరిష్కారానికే రైతు భరోసా కేంద్రాలు' - proddutooru latest news
కడప జిల్లా ప్రొద్దుటూరు రైతు భరోసా కేంద్రానికి స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి రెండు ట్రాక్టర్లను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కన్నబాబు పాల్గొన్నారు.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సొంత నిధులతో రైతు భరోసా కేంద్రాలకు ట్రాక్టర్లను అందించడం ఆనందంగా ఉందన్నారు. ట్రాక్టర్లను కన్నబాబు, సజ్జల చేతుల మీదుగా రైతు భరోసా కేంద్రం అధికారులకు అందించారు. వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన రైతు సంక్షేమ కార్యక్రమాలు.. కాస్త విరామం తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలవుతున్నాయని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు.
ఇదీచదవండి.